అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నేడు, రేపు వైఎస్‌ఆర్, అన్నయమ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం కడప జిల్లాకు సిఎం చేరుకున్నారు. హెలికాప్టర్ దిగగానే రాయచోటి ప్రజలకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, రాయచోటి ముస్లిం మత పెద్దలను ముఖ్యమంత్రి కలిశారు. శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ సిఎం జగన్ పాల్గననున్నారు. సొంత నియోజకవర్గం పులివెందుల (వైఎస్‌ఆర్ జిల్లా) లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్‌కు సిఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.










