Aug 30,2023 15:18

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : రాష్టంలో మహిళలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలుస్తున్నారని నగర మేయర్‌ మహమద్‌ వసీం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యక్రమం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటిన్‌ను బుధవారం నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ విజరు భాస్కర్‌ రెడ్డి,కమీషనర్‌ భాగ్యలక్ష్మి కార్యదర్శి సంగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్‌ మార్టుల తరహాలో మహిళలకు ఆహా క్యాంటిన్‌ల ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. తక్కువ ధరకు రుచి, శుచితో ఆహారం విక్రయాలు చేస్తుండటం అభినందనియమన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ విజయ లక్ష్మి, టిఎంసి శ్రీనివాస్‌ రెడ్డి , మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు సుగుణ శిరీష పల్లవి భువన వేణుగోపాల్‌ సత్యమూర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.