Nov 02,2023 10:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. సిఎంతోపాటు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నగరానికి చేరుకున్నారు. నేటి నుంచి రాడిసన్‌ బ్లూ హౌటల్‌ లో జరగబోయే 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌-74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక సమావేశాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 8 గంటల 55 నిముషాలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజని, నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ సుభద్ర, జిల్లా కలెక్టర్‌ డా. ఎ.మల్లిఖార్జున, పార్లమెంటు సభ్యులు బి.వి.సత్యవతి, జి.మాధవి, డిసిసిబి చైర్మన్‌ కోలా గురువులు, సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాధన్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌ లో 9 గంటల 8 నిముషాలకు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు మధురవాడ బయలుదేరి వెళ్లారు.