Oct 21,2023 12:26

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం జగన్‌.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, ఈ సందర్భంగా నవంబర్‌ 1న జరగనున్న వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను సీఎం జగన్‌ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.