వైఎస్‌ఆర్ (కడప) : సిఎం జగన్ కడపలో పర్యటిస్తున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా ... శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గనున్నారు. అనంతరం ఎకో పార్కు వద్ద వేముల మండల పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశం కానున్నారు. అక్కడి నుండి ఈరోజు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్‌లో కడప ఎయిర్ పోర్టుకు చేరుకొని గన్నవరంకు ప్రయాణమవుతారు.










