Apr 01,2023 13:56

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎటు చూసినా నిరుద్యోగ యువత ఆర్తనాదాలే వినపడుతున్నాయని టిడిపి, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎంపి, కొనకళ్ళ నారాయణ రావు తెలిపారు. శనివారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసన విలేకరుల సమావేశం తాను అధికారంలోకి రాగానే రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని పలికిన జగన్మోహన్‌ రెడ్డి నేడు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం చేతకాని జగన్మోహన్‌ రెడ్డి కనీసం నూతన పరిశ్రమలనైనా తెచ్చి వాటి ద్వారా ప్రైవేట్‌ ఉద్యోగాలనైన ఇస్తాడనుకున్న యువతకు కొత్త పరిశ్రమల తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తన అధికార బలంతో పక్క రాష్ట్రాలకు తరిమివేసి యువత భవితను ప్రశ్నార్ధకంగా మార్చాడన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో 21,570 మంది యువత ఆత్మహత్యకు పాల్పడ్డారని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పారన్నారు. అదేవిధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఐదు లక్షల 13 వేల మందికి ఉద్యోగ కల్పించారన్న వాస్తవాన్ని దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఈ వైసిపి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాటి టిడిపి ప్రభుత్వం అమరావతి నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలు కల్పన స్వీకారం చుడితే నేడు జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానులు అనే మూడు ముక్కలాట ద్వారా నిర్వీర్యం చేసి యువత ఉపాధికి గండి కొట్టారాని మండిపడ్డారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి కల్పిస్తే నేడు జగన్మోహన్‌ రెడ్డి దాన్ని రద్దు చేసి వారి ఉసురు కట్టుకున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జగన్‌ యువతను మోసం చేయడం మానే వెంటనే ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్‌ క్యాలెండర్ను ప్రకటించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) మాట్లాడుతూ మాటతప్పం మడమ తిప్పం అని గొప్పలు పోతున్న ఈ జగన్మోహన్‌ రెడ్డి నిరుద్యోగులకు ఇంత దారుణంగా మోసం చేస్తూ వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నరన్నారు. అలాగే 108 నియోజకవర్గాల్లో పట్టభద్రులు టిడిపి ఎమ్మెల్యే గెలిపించి ఉద్యోగస్తుల సత్తా చాటారని అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు వ్యతిరేకత ఉందని రాను నేను ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డికి తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ , బత్తిన దాసు, పివి ఫణి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.