Jul 03,2022 16:06

అమరావతి: సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న టిడిపి శ్రేణులను నోటీసుల పేరుతో సిఐడి వేధింపులకు గురిచేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకొని సిఐడి వేధించిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా నోటీసుల పేరుతో అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కుట్ర చేసిన సిఐడి అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో డిమాండ్‌ చేశారు.