చిట్టి తల్లులు లెహంగాలు వేసుకుని బుట్టబొమ్మల్లా నట్టింట నడయాడుతుంటే.. ఆ ముచ్చట చూసి తరించాల్సిందే! లెహంగాలను రెండు చేతులతో పట్టుకుని అల్లిబిల్లి తిరుగుతుంటే.. లెహంగాలు గుండ్రంగా విప్పార్చుకుంటే.. ఆ చిట్టి చిలకమ్మలను చూసిన ఎవ్వరికైనా ఆనందమే. లెహంగాకు తగ్గట్టు డిజైనర్ బ్లౌజెస్ బుల్లి చున్నీలతో మరింత వన్నె ఇచ్చాయి. ఇక్కడ చిత్రాల్లోని ఈ బుజ్జి బంగారాలు లెహంగాలతో ముద్దొచ్చేస్తున్నారు కదూ..!













