హుస్సేన్‌సాగర్ (హైదరాబాద్) : హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రయాణీకులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి పర్యాటకులతో బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లిన భాగమతి బోటు... భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి అదుపుతప్పి పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బోటులో 40 మందికి పైగా ఉన్నారు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటక బోటులోనివారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 40 మంది పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.










