Oct 31,2023 10:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఆమె భార్య భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' మలి విడత కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు జరగనుంది. నవంబర్‌ 1, 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. విజయనగరం రైలు ప్రమాద బాధితులను మంగళవారం భువనేశ్వరి పరామర్శించనున్నారు.