ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : కోర్టు, తహశీల్దార్, సబ్ జైల్, సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులను రూ.35 లక్షల వ్యయం తో డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.... కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ప్రారంభించిన పనులను 3 నెలల లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వర్షం పడితే కార్యాలయ ఆవరణంలో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది మున్సిపల్, సబ్ కలెక్టర్ వారి సహకారంతో రూ 35. లక్షల వ్యయంతో సి.సి రోడ్డు, డ్రైనేజ్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే.శాంత,మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇంజనీర్స్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.










