శ్రీకాళహస్తి (తిరుపతి) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి పరామర్శ యాత్రలో టిసిఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి తమ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్‌తో మఅతి చెందినవారి కుటుంబాల పరామర్శకు వెళుతున్న భువనేశ్వరిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికఅతమాల గ్రామంలో టిసిఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు జాసన, అమరేంద్ర, సురేశ్ రెడ్డి, తదితరులు మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడితో సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించిందన్నారు. సంస్థ ఉత్పత్తులు తదితర వాటిని భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భువనేశ్వరితో కలిసి కంపెనీ ప్రతిధులు, ఉద్యోగులు ఫొటోలు దిగారు.










