తెలంగాణ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో... సోమవారం మధ్యాహ్నం సూరంపల్లి దౌలతాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న బిఆర్‌ఎస్ దుబ్బాక అభ్యర్థి ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. రాజు అనే వ్యక్తి తనవెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకర్ రెడ్డి కడుపులో పొడిచాడు. దీంతో ఎంపి కడుపులో గాయమయ్యింది. అక్కడున్న బిఆర్‌ఎస్ నేతలంతా ఆ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. కత్తి దాడిలో గాయపడిన ఎంపిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.










