Oct 22,2023 11:39

హైదరాబాద్‌ : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బిజెపి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గోషామహల్‌ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈమేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్‌ పేరును పార్టీ అధిష్టానం చేర్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్‌ను గతేడాది ఆగస్టులో బీజేపీ సస్పెండ్‌ చేసింది. రాజా సింగ్‌ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలపనున్న అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్‌ పేరును అధిష్ఠానం చేర్చింది.