- అంతర్జాతీయ షెడ్యూల్‌ను విడుదల చేసిన బిసిసిఐ
ముంబయి: 2023-24 ఏడాదికి సంబంధించి టీమిండియా దేశీయ అంతర్జాతీయ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) మంగళవారం విడుదల చేసింది. హోం షెడ్యూల్‌లో భాగంగా భారతజట్టు మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో ఐదు టెస్ట్‌లు, 3వన్డేలతోపాటు మరో 8టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మూడు వన్డేలు మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో 5టి20ల సిరీస్‌ను నవంబర్ 23నుంచి టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా నవంబర్ 23న వైజాగ్, డిసెంబర్ 3న హైదరాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ టూర్‌లో భాగంగా ఆఫ్ఘన్ జట్టుతో భారత్ మూడు టి20ల సిరీస్‌లో ఆడనుంది. ఆ మూడు టి20లు మొహాలీ, ఇండోర్, బెంగళూరులో జరగనున్నాయి. 2024 జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా జనవరి 25, 2024 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో జరగనున్నాయి.
NEWS - BCCI announces fixtures for International Home Season 2023-24.
— BCCI (@BCCI) July 25, 2023
The Senior Men's team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here - https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fI
భారత పర్యటనకు వచ్చే విదేశీ జట్లు..
ఆస్ట్రేలియాతో 3వన్డేలు..
సెప్టెంబర్ 22 : తొలి వన్డే(మొహాలీ)
సెప్టెంబర్ 24 : రెండో వన్డే(ఇండోర్)
సెప్టెంబర్ 27 : మూడో వన్డే(రాజ్‌కోట్)
ఐదు టి20లు.
నవంబర్ 23 : తొలి టి20(వైజాగ్)
నవంబర్ 26 : రెండో టి20(త్రివేండ్రం)
నవంబర్ 28 : మూడో టి20(గౌహతి)
డిసెంబర్ 1 : నాల్గో టి20(నాగ్‌పూర్)
డిసెంబర్ 3 : ఐదో టి20(హైదరాబాద్)
ఆఫ్ఘనిస్తాన్‌తో 3టీ20ల సిరీస్..
జనవరి 11: తొలి టి20(మొహాలీ)
జనవరి 14: రెండో టి20(ఇండోర్)
జనవరి 17: మూడో టీ20(బెంగళూరు)
ఇంగ్లండ్‌తో 5టెస్ట్‌ల సిరీస్..
జనవరి 25-29 : తొలి టెస్ట్(హైదరాబాద్)
ఫిబ్రవరి 2-6 : రెండో టెస్ట్(వైజాగ్)
ఫిబ్రవరి 15-19 : మూడో టెస్ట్(రాజ్‌కోట్)
ఫిబ్రవరి 23-27 : నాల్గో టెస్ట్(రాంచీ)
మార్చి 7-11 : ఐదో టెస్ట్(ధర్మశాల)










