Aug 28,2023 15:02

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల పరిధిలోని బి పప్పూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం లింగ వివక్షతపై విద్యార్థులకు పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు రవిశంకర్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. వివాహ వయస్సు గురించి బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పర్వీన్‌ మాట్లాడుతూ.. అమ్మాయిలకు సరిఅయిన వివాహ వయసు రాకుండా పెళ్లి చేయడంతో చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని తెలిపారు. ఈనాడు అన్ని రంగాలలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారని మన సమాజంలో మహిళలు పట్ల నిరాదరణ ఇంకా తగ్గలేదన్నారు పుట్టబోయే ఆడశిశువు అని తెలియగానే ఇప్పటికి కొన్ని కుటుంబాలు గర్భస్రావంకీ సిద్దపడుతున్నారని తెలిపారు. ఇలా గర్భస్రావం చేయించు కోవడం వల్ల అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉందన్నారు. ఇది అలాగే కొనసాగితే మగవారికి తల్లి, చెల్లి, అక్క, భార్య ఉండదన్నారు. మహిళ లేకపోతే సృష్టి లేదు ప్రతి సృష్టి జరగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రవిశంకర్‌ హెల్త్‌ ఇండికేటర్‌ పర్వీన్‌ ఎం పి హెచ్‌ ఈ ఓ మల్లికార్జున సూపర్వైజర్‌ శ్రీ రాములు ఎం పి హెచ్‌ఎస్‌లు సరస్వతి ఏఎన్‌ఎం అంజలి శ్రీదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు