ప్రజాశక్తి-ఆదోని రూరల్ (కర్నూలు) : 77వ స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకొని... ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జెసి నారపురెడ్డి మౌర్య చేతుల మీదుగా ఉత్తమ సబ్ కలెక్టర్ గా అభిషేక్ కుమార్, ఉత్తమ తహశీల్దార్‌గా ఆదోని తహశీల్దార్ వెంకటలక్ష్మి,ఉత్తమ విఆర్వోలుగా విధులు నిర్వహిస్తున్న కుప్పగల్ వీఆర్వో వామన్ రావు, పెద్దతుంబలం విఆర్వో చిన్న ఈరన్న, అమరావతి నగర్ వీఆర్వో రాజశేఖర్ గౌడ్,డివిజనల్ పంచాయితి అధికారి కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ తేజ, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ దంపతులు చేతుల మీదగా ఉత్తమ అధికారులు అవార్డులు అందుకున్నారు.
అలాగే పెద్ద హరివాణం బీసీ హాస్టల్ వార్డెన్ శివుడు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పి.వెంకటలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పెద్దహరివనం పిహెచ్సి పరిధిలో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ విజయలక్ష్మి ఉత్తమ సూపర్వైజర్ అవార్డు అందుకున్నారు. ఇస్వి ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి విజయవాడలో జిఎస్డబ్ల్యూఎస్ డాక్టర్ జి.లక్ష్మయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.










