భారత్‌లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ జరగనుండగా, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అప్పుడే జట్టును కూడా ప్రకటించేసింది. 18 మందితో ప్రకటించిన ఈ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జట్టులో లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా, ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ ఎంపికయ్యారు.
జట్టు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉండడు), జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, సీన్ అబ్బాట్, అస్టన్ అగర్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్, నాథన్ ఎల్లీస్










