యాషెస్ సిరీస్ నాల్గో టెస్ట్
మాంచెస్టర్:మూడో టెస్టులో అనూహ్యంగా ఆసీస్ ఓడినప్పటికీ ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆడే జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంది.










