- ఎంపిపితో సహ మరో 6 పై కేసు నమోదు
ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండలం తాటిపాక గ్రామంలో రాజోలు ఎంపిపి కేతా శ్రీనివాస్ అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్‌లో శనివారం సాయంత్రం పేకాట ఆడుతున్నట్లు రాజోలు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న రాజోలు ఎస్‌ఐ పృథ్వీ పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ విషయం తెలిసినా.. లోపల ఉన్న వ్యక్తులు కొద్దిసేపు తలుపు తెరవకుండా ఇబ్బందిపెట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయి తలుపులు మూసివేశారు. అనంతరం పేకాట ఆడుతున్న తాటిపాక వార్డు మెంబర్ నాగిరెడ్డి గోపి, గుబ్బల శ్రీరామ మూర్తి,తోట కృష్ణ స్వరూప్, కంచి అప్పన్న, సిరిజనీడి రమేష్, సిరిజనీడి సత్యనారాయణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో ఎంపిపి శ్రీనివాస్ పారారిలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పేకాట ఆడుతున్న వారిలో వీరి వద్ద నుండి రూ 16,800, ఐదు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకుని ఏడుగురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు .అయితే, వీరిని తప్పించడానికి స్థానికనేతలు శతవిధాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.










