న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. సిఈసి రాజీవ్‌కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.










