వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను సృష్టించాడు.
రికార్డులివే..
- వెస్టిండీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. ఇంతకు ముందు 2016లో 83 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన అశ్విన్, ఈసారి 71 పరుగులకే 7 వికెట్లు తీశాడు..
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అ నిలిచాడు. ఇప్పటివరకు 271 మ్యాచ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 709 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్(707)ను అశ్విన్ అధిగమించాడు.
- టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా అశ్విన్(34 సార్లు) నిలిచాడు. శ్రీలంక తరుపున 34 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన రంగనా హేరాత్ రికార్డును సమం చేశాడు. అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు.
- అశ్విన్ కెరీర్‌లో 27 ఫోర్ వికెట్, 34 ఫైవ్ వికెట్, ఎనిమిది 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.
- విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన దివంగత ఆసీస్ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. వీరిద్దరూ 28 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించారు.










