ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు జంధ్యాల రఘుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు నగరంలోని పాత బస్తీలోని గడియారం హాస్పిటల్ ఎదురుగా ఉన్న ,ఆఫీస్‌లో డాక్టర్ గరికపాటి రాజారావు , 60వ వర్ధంతి డి .పార్వతయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు జంధ్యాల రఘుబాబు , సిపిఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, కళలను పట్టించుకోవడంలేదని, సాంస్కృతిక కళారూపాలను నిర్వహిస్తున్న కళాకారులను గుర్తించడం లేదన్నారు. కళాకారులకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాయని, వారు ధ్వజమెత్తారు. కళ కల కోసం కాదని, కళ ప్రజల కోసం కళ ప్రగతి కోసమని వారు గరికపాటి రాజారావు వర్ధంతి సందర్భంగా తెలియజేశారు. గరికపాటి రాజారావు స్వతహాగా దర్శకుడు, నిర్మాత, నటులు అని వారు కొనియాడారు. పుట్టినిల్లు అనే సినిమా తీసి, దివాలా అయినా డాక్టర్ గరికపాటి రాజారావు, వేరేవాళ్లు బయటి నుండి ఆర్థిక సహాయం చేస్తే బతకడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితులలో, ఉన్నప్పటికీ ఆ సినిమా ద్వారా హాస్య బ్రహ్మీ అల్లూరి రామలింగయ్యను, పేరు ప్రఖ్యాతలు గాంచిన జమునను ,డాక్టర్ గరికపాటి రాజారావు తన పుట్టినిల్లు సినిమా ద్వారా సినిమా ఇండిస్టీకి పరిచయం చేశారని, వారు కొనియాడారు. గరికపాటి రాజారావు వేదన, శోధన, సాధన, ప్రదర్శన అనే గుణాలను అలమరుచుకున్నారని వక్తలు వివరించారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర వ్యవస్థాపకు లు కూడా అని ఘనంగా చెప్పుకోచ్చారు.అనంతరం పిఎన్‌ఎమ్ బాధ్యులు మొహమ్మద్ షరీఫ్, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు లోకేష్ మాట్లాడుతూ.. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన సమస్యల పైన చర్చ కాకుండా, కులం, పేరుతో మతం పేరుతో, ప్రాంతీయ విభేదాలు సష్టించి, హిందూ, ముస్లింల మధ్య, హిందూ, దళితుల మధ్య తగాదాలు పెట్టి వారి మధ్య, చిచ్చును పెట్టి రాజకీయంగా, లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని, కళాకారులుగా మనమందరం బిజెపి యొక్క ప్రభుత్వ విధానాలను ఎండగట్టి, కళారూపాల ద్వారా ప్రజలను, చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రజానాట్యమడలి ,కళాకారుల పైన ఎంతైనా ఉందని ,వారు కళాకారులను కోరారు.కళారూపాల ద్వారా, సాంస్కతిక కళారూపాల ద్వారా ,ప్రజలను చైతన్యపరచి, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పైన పెద్ద ఎత్తున పోరాటాలకు ,ప్రజలను సిద్ధం చేయాలని ,అటువంటి చైతన్యం కళాకారులకు మాత్రమే ఉంటుంది .కాబట్టి ప్రజానాట్యమండలి నినాదం ఏదైతే ఉందో కళ కళా కోసం కాదు, కల ప్రజల కోసం అనే దాన్ని మనం నిరూపించుకోవాల్సిన, అవసరం ఇప్పుడు వచ్చిందని వారు కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష ,కార్యదర్శులు డి. అబ్దుల్ దేశారు, విజరు ప్రజానాట్యమండలి నగర కార్యదర్శి ,బి రాంబాబు ,బాలు ,బతు కన్నా ,సరిత, లక్ష్మి, బజారి ,వేణు ,దామోదర్, బాబులి, శాలి భాష ,గణేష్, అన్వర్ ,సాదిక్, రామకష్ణ, లక్ష్మన్న, ఆనందు తదితరులు పాల్గొన్నారు.










