Oct 27,2023 12:23

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్‌ డేటాను ఇవ్వాలని కోరుతూ ... టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం విజయవాడలోని ఎసిబి కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. ఇరువురి తరపు న్యాయవాదుల వాదోపవాదాలను విన్న ధర్మాసనం ... తీర్పును రిజర్వ్‌ చేసింది. కాల్‌ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్నట్లు ఎసిబి కోర్టు తెలిపింది.