Oct 29,2023 18:59

అమరావతి: డిసెంబర్‌ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ , అమరావతి సాహితి మిత్రులు సంయుక్తంగా కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు అమరావతి సాహితి మిత్రులు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ రావి రంగా రావు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి అయిదు వేల రూపాయలు, రెండవ బహుమతి మూడు వేల రూపాయలు, మూడవ బహుమతి రెండు వేల రూపాయలు. 2023 డిసెంబరు 9న గుంటూరులో జరిగే సాహిత్య సభలో కవులకు బహుమతులు ఇస్తా మన్నారు. ''అవినీతి వ్యతిరేక ఉద్యమం - ప్రజల భాగస్వామ్యం'' అనే అంశం పై పద్య కవిత/ గేయం/వచన కవితలను 9493686165 వాట్సప్‌ నెంబరుకు నవంబర్‌ 20 లోగా పంపించవలసిందిగా కోరారు. డిసెంబర్‌ 9న బహుమతి పొందిన కవితలతో పాటు ఎంపిక చేసిన కొన్ని కవితలు షాప్‌ - టివి ఛానెల్‌ ద్వారా ప్రసారం చేయబడతాయి అని డాక్టర్‌ రావి రంగారావు తెలిపారు.