Sep 19,2023 15:43

కోట: ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియమ్‌ సింగ్‌ అనే 17 ఏళ్ల విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ మహువా ప్రాంతానికి చెందిన ప్రియమ్‌ సింగ్‌ ఇంటర్‌ పూర్తి చేసింది. వైద్య విద్య అభ్యసించేందుకు కోటాలో శిక్షణ తీసుకుంటోంది. విజ్ఞాన్‌ ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం కోచింగ్‌ సెంటర్‌ వద్ద వాంతులు చేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు ప్రియమ్‌ సింగ్‌ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. విషం తాగి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.