- - అమెరికా చరిత్రలో 191 ఏళ్ల తర్వాత టై బ్రేకింగ్ ఓటు..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్(58) మరో రికార్డు నెలకొల్పారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ టైబ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకోవడం 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ను అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో కల్పనా కోటగల్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ టై బ్రేకింగ్ ఓటు వేశారు.










