Aug 28,2023 17:32

ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ నగేష్‌ ఆదేశానుసారం సోమవారం స్థానిక ఎంపీపీ సెంట్రల్‌ స్కూల్‌లో పిల్లలకు హెల్త్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అక్బర్‌ బాషా విద్యార్థులకు రక్తహీనత- వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగించారు. విద్యార్థులు ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, విటమిన్‌ సి ఉన్నఆహర పదార్థాలు తీసుకోవాలని, భోజనానికి ముందు తర్వాత కాఫీ టీ తాగరాదని, ఐరన్‌ మాత్రలు వాడటానికి ముందు నులి పురుగుల నివారణ మాత్ర తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయకుండా వ్యక్తిగతం మరుగుదొడ్లు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని, భోజనానికి ముందు మల విసర్జన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బాల ఆరోగ్య స్వాస్త్య కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న పిల్లలకు ఐరన్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్‌, లక్ష్మి, సచివాలయం హెల్త్‌ సెక్రటరీ సువర్ణ ,ఆరోగ్య పర్య వేక్షకులు కృష్ణమ్మ, సూర్యనారాయణ ,ప్రకాష్‌ రావు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.