అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తఅటిలో తప్పింది. ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా కావలి -బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను అడ్డు పెట్టారు.అదే సమయంలో అటుగా వచ్చిన నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు పట్టా ముక్కను ఢ కొట్టగానే అది దూరంగా పడిపోయింది. దీంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు.










