న్యూఢిల్లీ: 46 మంది జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని బిజినెస్ స్టాండర్డ్ మాజీ ఎడిటర్, ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు వ్యాఖ్యానించారు. న్యూస్‌క్లిక్‌పై ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ స్థాయి పోలీసుల అసమర్థతకు చిహ్నమన్నారు. రైతుల నిరసనలు, పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఢిల్లీ అల్లర్లు వంటి ఘటనలను కవర్ చేశారా అని విలేకరులను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జర్నలిస్టులు ఉన్నది అటువంటి పరిణామాలను కవర్ చేయడానికేనన్న స్పృహ వుండేవారెవరైనా ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా అని ఆయన అన్నారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిపై వచ్చిన ఆరోపణలు నవ్వుపుట్టించేవిగా ఉన్నాయని సంజరు బారు వ్యాఖ్యానించారు.










