- యాత్రికులను అప్రమత్తం చేసిన టిటిడి ..
ప్రజాశక్తి -తిరుమల : అలిపిరి నడకమార్గంలో చిరుత, ఎలుగు బంటి సంచారం కలకలం రేకెత్తించింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో ఆ దారిలో ఈ జంతువులు తిరుగుతున్నట్టు అక్కడ అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో టీటీడీ యాత్రికులను అప్రమత్తం చేసింది. . ఈ మేరకు టీటీడీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నడకదారిలో తిరుమలకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని.. యాత్రికులు గుంపులు, గుంపులుగా రావాలని కోరింది. అలిపిరి నుంచి తిరుమల నడగ దారిలో అక్టోబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య చిరుత, ఎలుగు బంటి సంచారం కనిపించినట్టు కెమెరాల్లో రికార్డు అయ్యిందని పేర్కొంది. ాాభక్తులకు ఓ విజ్ఞప్తి.. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిపై శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో అక్టోబర్ 24 నుంచి 27 వరకు చిరుత, ఎలుగుబంటి కదలికలు ఉన్నట్టు కెమెరా ట్రాప్ లో రికార్డు అయ్యాయి. ్ణ్ణ అని పేర్కొంది. ాాకాబట్టి భక్తులు నడకదారిలో అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.్ణ్ణ అని ట్విట్టర్ లో పోస్టు చేసింది.










