Aug 26,2023 12:19

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కందిగాపల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు .... కందిగోపాల గ్రామానికి చెందిన వీఆర్‌ఏ నరసింహులు కుమారుడు తలారి రాజేంద్రప్రసాద్‌ (22) మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి బాగా మద్యం సేవించి వారికి చెందిన తోటలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.