Jul 17,2023 09:40
  • వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ కైవసం
  • ఉత్కంఠ పోరులో జకోవిచ్‌పై గెలుపు

లండన్‌ : వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురు షుల సింగిల్స్‌ టైటిల్‌ను టాప్‌సీడ్‌, స్పెయిన్‌కు చెందిన 20ఏళ్ల కార్లోస్‌ అల్కరాజ్‌ కైవసం చేసుకున్నా డు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో అల్కరాజ్‌ 1-6, 7-6(8-6), 6-1, 3-6, 6-4తో 2వ సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌పై విజయం సాధించాడు. దీంతో తొలిసారి వింబుల్డన్‌, కెరీర్‌లో 2వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకు న్నాడు. ఈ ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌తో పాటు 8వ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ చేజిక్కించు కోవాలన్న జకోవిచ్‌ ఆశలు అడియాశలయ్యాయి. అల్కరాజ్‌ రూ.25కోట్లు, జకోవిచ్‌కు రూ.12.50కోట్లు ప్రైజ్‌ మనీ దక్కింది.