అనురాగము విరిసేనా.. అన్నట్లు అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు.. ఒకేలాంటి డ్రెస్సులతో కనువిందు చేసేలా డిజైనర్స్ రూపొందించినవి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేశాయి. దేన్నయినా వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవడం వ్యాపారస్తుల సహజ లక్షణం. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా ఒకే రకమైన రంగులు, డిజైన్ల మేళవింపులో ఉన్న డ్రెస్సులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక్కడ అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు వేసుకున్న డ్రెస్స్‌లు చూస్తుంటే ఏకానుబంధం కనిపిస్తోంది కదూ..!












