Nov 06,2023 21:55

విజయవాడ (బస్‌స్టేషన్‌) : విజయవాడ ఆర్‌టిసి బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 12వ నంబర్‌ ప్లాట్‌ఫాం వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి మృతి చెందారు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

vja 01