న్యూఢిల్లీ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీ నగర చేపట్టిన నిరసన ర్యాలీకి దేశ వ్యాప్తంగా స్పందన లభించింది. ఛలో ఢిల్లీ 5 జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ప్రజాసంఘాలు సిఐటియు,ఆల్ ఇండియా కిసాన్ రైతు సంఘం,కౌలు రైతు సంఘాలు చేపట్టిన భారీ ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్ ) నాయకులు ఆకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు ఆకుల వెంకటనారాయణ జాతీయ మీడియాతో ఢిల్లీ నగర వీధులలో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించటంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనారని ఆరోపణలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మీడియాను తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రభుత్వ, ప్రైవేటు సెకార్టలను నిలవుదోపిడి చేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపిన మీడియా పై మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా పై దాడులకు పాల్పడుతున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డు జర్నలిస్టులకు కనీస పెన్సన్ 10 వేలు ఇవ్వాలని కోరారు. వేజ్ బోర్డు ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, పెండింగ్ అక్రిడేషన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో జర్నలిస్టు నాయకులు వి.రవిశేఖర్, రాజు, ఎం.శ్రీనివాసరావు, అరిగెల శ్రీనివాసరావు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల ఆందోళన నిరసన ర్యాలీకి సిఐటియు ఎన్టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు, సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్, సిఐటియు,కౌలు రైతు సంఘం నాయకులు సందెపోగు లింగయ్య, సుబ్బారావు,కర్రి వెంకటేశ్వరరావు పలువురు సంఘీభావం తెలిపారు.










