Nov 07,2023 16:21

అమరావతి: స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆర్‌. హరిప్రకాశ్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరిప్రకాశ్‌ను ఆదేశిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఆ శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ విజయభారతికి స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేధింపులు, అక్రమ బదిలీలపై ఆర్‌.హరిప్రకాశ్‌పై గత కొంతకాలంగా ఆడిట్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌.హరిప్రకాశ్‌ను స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌గా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.