ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు): మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని ఎపి సిఎస్ జవహర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీ మఠంలో జరుగుతున్న ఆరాధన మహోత్సవాలకు పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు ఆహ్వానించిన నేపథ్యంలో చివరి రోజు మంత్రాలయం వచ్చారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న వారికి శ్రీ మఠం ఏఏఓ మాధవ్ శెట్టి , మేనేజర్లు యస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సహయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీ పతిఆచార్ పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం అందజేసి ఆశీర్వదించారు. తదనంతరం గో సంరక్షణ శాల , శ్రీ రామ విగ్రహాన్ని, అభివృద్ధి పనులను పీఠాధిపతులతో కలిసితో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ , ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య , మంత్రాలయం సిఐ శ్రీనివాసులు , తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజ్, ఎంపిడిఓ మణిమంజరి, మాధవరం ఎస్‌ఐ కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.










