- ఆసియా క్రీడలకు జట్టును ప్రకటించిన ఎఐఎఫ్‌ఎఫ్
- 30నుంచి భువనేశ్వర్‌లో శిక్షణా శిబిరం
కోల్‌కతా: చైనాలోని గ్వాంఝూ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించే భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎఐఎఫ్‌ఎఫ్) సోమవారం ప్రకటించింది. మొత్తం 34మంది ఆటగాళ్ల ప్రోబబుల్స్‌తో కూడిన జట్టును ప్రకటించిన ఎఐఎఫ్‌ఎఫ్ వీరందరికీ భువనేశ్వర్ వేదికగా జులై 30నుంచి శిక్షణను ఇవ్వనుంది. ఆసియా క్రీడలకు ముందు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు రెండు సన్నాహక మ్యాచ్‌లను తస్కెంట్‌లో ఆడనుంది. ఇక గ్రూప్-సిలో ఉన్న భారతజట్టు తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 26న జపాన్‌తో, 29న వియత్నాంతో, నవంబర్ 1న ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లను ఆడనుంది. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు కిర్గిజ్ రిపబ్లిక్‌ను ఓడించడం ద్వారా రౌండ్-2కు అర్హత సాధించింది.
గోల్‌కీపర్లు : సౌమ్య నారాయణస్వామి, మీబమ్ లిథోంగోంబి దేవి, శ్రేయా హుడా.
డిఫెండర్లు : ఆశాలత దేవి, స్వీటీ దేవి, సంజు, రీతు రాణి, రజనా ఛాను, మార్గరేట్, దలిమా ఛిబ్బర్, మనీసా పన్న, అస్టమ్ ఓరోన్, జూలి కిషన్, షిల్కే దేవి, జబమని తుడే.
మిడ్‌ఫీల్డర్లు : ప్రిమాంక దేవి, అంజు తమాంగ్, ఇందుమతి, సంగీత బస్ఫోర్, కాజల్ హబెర్ట్, అసెం రోజా దేవి, కార్తీకా అంగముత్తు
ఫార్వర్డ్స్ : దంగమ్ గ్రేస్, సౌమ్య, మనీషా కళ్యాన్, అపుర్ణ నర్‌జారీ, నేహా, సుమతి కుమారి, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సంధ్యా రంగనాథన్, ప్యారీ కకా, జ్యోతి, ఎన్. బాలాదేవి.










