Jul 16,2023 13:36

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మార్కెట్లో ధరలు పెరిగిన నేపథ్యంలో ... రైతు బజారుల ద్వారా తగ్గింపు ధరలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేసేందుకు రైతు బజార్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సివిల్‌ సప్లై అధికారిణి వి.పార్వతి తెలిపారు. శనివారం చల్లపల్లి రైతు బజారులో తక్కువ ధరకు బియ్యం విక్రయ స్టాల్‌ ను ప్రారంభించారు. పార్వతి మాట్లాడుతూ ... జిల్లాలో మొత్తం పది కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి రైతు బజారు ఎస్టేట్‌ అధికారి బలి చక్రవర్తి, దివి తాలూకా రైస్‌ మిలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.