Sep 09,2023 08:13

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఒకవైపు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్న కేంద్రం... ఆ నిధుల విడుదకు మాత్రం అనేక కొత్త విధానాలను అమలు చేస్తోరది. దీంతో నిధుల రాక మరింత ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఇప్పటికే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలు, కేంద్ర ఆధీనంలోని పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం వంటి చర్యల వల్ల నిధుల రాక తగ్గిందని చెబుతున్నారు. తాజాగా 'జస్ట్‌ ఇన్‌ టైమ్‌' అరటూ మరో కొత్త విధానానికి కేంద్రం తెరలేపిరది. రాష్ట్రాలకు కేంద్రం అరదిరచే నిధులను సక్రమంగా, సకాలంటో అందించేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆరధ్రప్రదేశ్‌తోపాటు బీహార్‌, గుజరాత్‌, అసోర రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతానికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేరద్ర పథకాలకు వచ్చే నిధుల కోసం ప్రస్తుతం సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలను అమలు చేయాలంటూ ఉన్న నిబంధనను నూతన విధానంలో స్టేట్‌ లిరక్‌డ్‌ స్కీమ్‌లకు అనుగుణంగా రాష్ట్ర ఖజానా ఖాతాలను నిర్వహిరచాలని పేర్కొన్నారు. ఈ ఖాతాలు కూడా రిజర్వ్‌బ్యారకుకు అనుసంధానంగా ఉరడాలని స్పష్టం చేసిరది. అప్పుడే కేంద్ర వాటా నిధులను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. రిజర్వ్‌బ్యారకులో ఖాతాలు ప్రారంభిరచిన అనంతరం ఇతర అరశాలకు పిఎఫ్‌ఎంఎస్‌ను సంప్రదిరచాలని, అప్పుడే ఈ ఖాతాల వివరాలు ఎస్‌ఎన్‌ఏ-స్పార్ష్‌ ప్లాట్‌ఫారంకి కూడా అనుసంధానం కానున్నాయి. పథకాలకు సంబంధిరచిన రాష్ట్ర స్కీమ్‌ మేనేజర్లు ఒక్కో స్టేట్‌ లిరక్‌డ్‌ స్కీమ్‌లను ఆర్‌బిఐ నురచి వచ్చిన అధికారిక పత్రాల ద్వారా ఖాతాలను నిర్వహిరచాలని కూడా పేర్కొరది. అయితే, దీనివల్ల ఖాతాల నిర్వహణలో రాష్ట్రాల స్వతంత్రత పోతుందని, ప్రక్రియ కూడా ఆలస్యంతో కూడుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.