Jul 29,2023 22:28

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) సభ్యులు వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగే మూడు పిచ్‌లను పరిశీలించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం పిచ్‌లను పరిశీలించనున్నట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్న ఐసిసి బృందం దక్షిణాది రాష్ట్రాల్లోని మూడు పిచ్‌లను సందర్శించనున్నట్లు, ఆ వేదికల్లో ప్రాక్టీస్‌ జరుగుతాయని, అందులో భాగంగానే ముంబైలోని వాంఖడే స్టేడియంనూ సందర్శించనున్నట్లు తెలిపింది. ఐసిసి సభ్యులు జులై 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను సందర్శించినట్లు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఐసిసి సభ్యులు శుక్రవారం ఇక్కడకు విచ్చేశారని సన్నాహాలను చూసి సంతృప్తి చెందారని, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లనూ కొంతసేపు పరిశీలించారని ఆయన తెలిపారు.