Jul 14,2023 22:20

వెస్ట్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌
బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్‌ను 146పరుగులకు ఆలౌట్‌ చేసిన సౌత్‌జోన్‌ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి 7వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(35), కెప్టెన్‌ హనుమ విహారి(42), రికీ బురు(37), సచిన్‌ బేబి(28) బ్యాటింగ్‌లో రాణించారు. శుక్రవారం ఆట నిలిచే సమయానికి సుందర్‌(10), సాయికిషోర్‌(16) క్రీజ్‌లో ఉన్నారు. నాగ్వాస్వల్లా, అతిథ్‌ సేఠ్‌, ధర్మేంద్రసింగ్‌ జడేజాకు రెండేసి, చింతన్‌ గాజాకు ఒక వికెట్‌ దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌ జట్టు 213పరుగుల చేయడంతో ఇప్పటివరకు 248పరుగుల ఆధిక్యత లభించినట్లైంది.