Aug 03,2023 22:25

బెంగళూరు: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో అర్ధభాగం ముగిసే సమయానికే భారత్‌ 5-2గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. తొలి క్వార్టర్‌ ముగిసే సరికే భారత్‌ 3-0గోల్స్‌ ఆధిక్యతలో ఉంది. 5వ, 8వ ని.లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ కొట్టాడు. ఆ తర్వాత సుఖ్‌జీత్‌ సింగ్‌ అందించిన బంతిని వరుణ్‌ కుమార్‌ 15వ ని.లో గోల్‌ చేయడంతో భారత్‌ తొలి క్వార్టర్‌ ముగిసేసరికే 3-0 ఆధిక్యతలో నిలిచింది. ఇక రెండో క్వార్టర్‌ ప్రారంభంలోనే మన్‌ప్రీత్‌ సింగ్‌(16వ ని.), 19వ ని.లో వరుణ్‌ కుమార్‌ ఒక్కో గోల్‌ కొట్టారు. దీంతో భారత్‌ 5-1 ఆధిక్యతలో నిలిచింది. ఈ క్రమంలో చైనా తరఫున జీాషింగ్‌ జియో ఒక గోల్‌ కొట్టి భారత్‌ ఆధిక్యతను 5-2కు తగ్గించాడు. తొలి మ్యాచ్‌లో మలేషియా జట్టు 3-1గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను, కొరియా జట్టు 2-1గోల్స్‌ తేడాతో జపాన్‌ను ఓడించి శుభారంభం చేశాయి.