Oct 28,2023 16:06

శంషాబాద్‌: శంషాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దేవ చెప్పుల దుకాణంలో ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. అప్రమత్తమైన స్థానికులు సామగ్రి ని బయటకు తీసుకువచ్చారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తోనే అగ్ని ప్రమాదం జరిగిందని యజమాని తెలిపాడు. రూ.28 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు.