Oct 30,2023 16:50

సిద్దిపేట : దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గన్న ప్రభాకర్‌ రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు (38) అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రభాకర్‌ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ప్రభాకర్‌ రెడ్డిని ప్రాథమిక చికిత్స నిమిత్తం గజ్వేల్‌ దవాఖానకు తరలించామని, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.