Jul 20,2023 22:20

ఫిఫా ర్యాంకింగ్స్‌ విడుదల
రోమ్‌: ఫిఫా తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు సత్తా చాటింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఫిఫా) గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 99వ స్థానంలో నిలిచింది. ఇటీవల ముగిసిన శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌తోపాటు ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ గెలుచుకోవడంతో భారత్‌ ఖాతాలో 2పాయింట్లు జమ అయ్యాయి. 1996 తర్వాత భారత ఫుట్‌బాల్‌ జట్టు 100లోపు ర్యాంక్‌లో నిలవడం ఇదే తొలిసారి. 1996లో భారత్‌ ఫిఫా ర్యాంకింగ్స్‌లో 94వ స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. అలాగే ఆసియాఖండంలో 18వ ర్యాంక్‌కు ఎగబాకింది. దీంతో భారతజట్టు ఫిఫా 2026కు అర్హత టోర్నీకి దారి సుమమైనట్లయ్యింది. దీంతో ఫిఫా క్వాలిఫికేషన్‌ తొలిరౌండ్‌లో పోటీని అక్టోబర్‌ 12న, రెండో మ్యాచ్‌ను అక్టోబర్‌ 17న ఆడనుంది. ఇక ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టును పంపేందుకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) జట్టును పంపేందుకు క్రీడా మంత్రిత్వశాఖ నిరాకరించిన విషయం తెలిసిందే.