ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ వివో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.58 అంగుళాల ఫుల్ హెడ్‌డీం డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలను కూడా అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఇక బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. అలాగే ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందివ్వడం జరిగింది. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు ఇందులో ఉన్నాయి. అయితే కంపెనీ మాత్రం ఈ ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి రూ.15 వేల రేంజ్‌లోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.










