నిందితుడితో పోలీసులు
ప్రజాశక్తి-జి.మాడుగుల:మండల కేంద్రంలో ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 55 కేజీల గంజాయి, రూ.85,500 నగదు స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారున్ని ఆపి తనిఖీ నిర్వహించగా గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ద్విచక్ర వాహనతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా కుమ్మిడి సింగి పంచాయతీ గద్దెరాయ గ్రామానికి చెందిన వంతల కొండబాబు గా గుర్తించారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.










