Aug 19,2023 19:59

ధ్రువపత్రం అందజేస్తున్న అధికారులు, నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని 52 బసాపురం గ్రామంలోని 3వ వార్డు సభ్యులు కమ్మరి లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో 3వ వార్డు సభ్యులు కమ్మరి సుజాత అనారోగ్యంతో మృతి చెందారు. ఈ స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి నేతృత్వంలో ఆ స్థానానికి కమ్మరి లక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రత్యర్థిగా ఈ స్థానానికి ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో వార్డు స్థానం ఏకగ్రీవమైంది. కమ్మరి లక్ష్మికి శనివారం స్టేజ్‌-1 రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రభావతి ధ్రువీకరణ పత్రం అందజేశారు. సర్పంచి రాఘవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దేవి ఉన్నారు.